భీష్మ రివ్యూ
Spotnewschannel.com Rating : 3.5/5
‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్ గా వచ్చిన సినిమా ‘భీష్మ’. సినిమాలోని పాటలు, ట్రైలర్ లకు మంచి స్పందన రావడంతో.. ఈ రోజు రిలీజ్ కి భారీ బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
కథ :
భీష్మ (నితిన్) డిగ్రీని సగంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురుచూస్తూ తనకు నచ్చినట్టు లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. మరో పక్క వ్యవసాయ రంగానికి చెందిన ‘భీష్మ ఆర్గానిక్ కంపెనీ’ ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సీఈఓ భీష్మ (అనంత్ నాగ్) ఉంటాడు. అందుకోసం తన తర్వాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్లే సీఈవో కోసం చూస్తుంటాడు. ఈ మధ్యలో నితిన్ చైత్ర (రష్మిక)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె వెంట పడుతూ ఆమెను లవ్ లో పడేయడానికి ట్రై చేస్తాడు. అంతలో కొన్ని ఊహించని పరిణామాల ద్వారా బీష్మ (నితిన్) తనకు ఏ సంబంధం లేని ‘భీష్మ ఆర్గానిక్ కంపెనీ’ భాద్యతలు చేపడతాడు. ఆ తర్వాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు? అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈవో అయ్యాడు? చివరికి నితిన్ రష్మిక ఒక్కటవుతారా? లేదా? మొత్తంమ్మీద ఈ క్రమంలో నితిన్ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత సినిమాల కంటే ఈ సినిమాలో చాలా ఫ్రెష్ గా కొత్తగా కనిపించాడు. తన పాత్రతో పాటు మంచి టైమింగ్ తో బాగా నవ్వించాడు. ముఖ్యంగా కార్ సీన్, ఫోన్ లో మెసేజ్ చేసే సీక్వెన్స్ లో అలాగే మిగిలిన కామెడీ అండ్ లవ్ సీన్స్ లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇంటర్వెల్ సీన్ లో కూడా చాలా బాగా చేశాడు. హీరోయిన్ గా నటించిన రష్మిక తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది. సినిమాలో ఇంపార్టంట్ రోల్ లో కనిపించిన అనంత్ నాగ్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. మరో కీలక పాత్రలో కనిపించిన హెబ్బా పటేల్ స్క్రీన్ షోకే పరిమితం అయింది.
అలాగే తండ్రి పాత్రలో నటించిన సంపత్ రాజ్ తన నటనతో మెప్పించారు. ఇక సినిమాలోని మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు వెంకీ ఫస్ట్ హాఫ్ ని సరదాగా నడిపాడు. సెకండాఫ్ లో కూడా సరదాగా నడుపుతూనే ఆర్గానిక్ సంబంధించి మంచి మెసేజ్ ఇస్తూ కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేసారు. అదేవిధంగా ఆర్గానిక్ పాయింట్ తో సినిమాలో కాస్త కొత్తదనం తెచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లేలో కామెడీ చూపించిన విధానం వర్కౌట్ అవుతుంది. సినిమా ఫస్ట్ ఆఫ్ ఎంటర్టైన్ గా సాగినా సెకండ్ ఆఫ్ మాత్రం కాస్త నెమ్మగిస్తుంది. అలాగే దర్శకుడు రాసుకున్న కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువ కావడంతో నేచురాలిటీ లోపించినట్లు అనిపిస్తుంది.
అలాగే.. ఆర్గానిక్ ట్రాక్ కి సంబంధించి మరింతగా చొప్పించి ఉంటే బాగుండేది. సినిమాలో స్టోరీ లైన్ బాగున్నా.. సినిమాలో విలైనంత భావోద్వేగాన్ని పండించడంలో కాస్త లోపం జరిగింది.
సాంకేతిక విభాగం :
డైరెక్టర్ వెంకీ రాసుకున్న స్టోరీని స్క్రీన్ మీద మంచి ఫన్ తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కాకపోతే ఆయన స్క్రీన్ ప్లే విషయంలో సెకండ్ ఆఫ్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే.. సినిమాలో లొకేషన్స్ అన్నీ చాలా అందంగా కనువిందు చేస్తాయి. సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఎడిటింగ్ బాగున్నప్పటికీ... సెకండ్ హాఫ్ లోని కొన్ని చోట్ల ఉన్న స్లో మొషన్ తో బోర్ అనిపిస్తుంటుంది. నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు రిచ్ గా ఉంటాయి.
తీర్పు :
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా.. డీసెంట్ కామెడీతో రొమాంటిజాన్ని ఆర్గానిక్ టచ్ లతో ప్రేక్షకులను అలరిస్తుంది.