loader

ివ్యూ ఇన్ఫో

  • Release date: Feb 07, 2020
  • Starring: నటీనటులు :  వరుణ్, దివ్యా రావు తదితరులు
  • Director: దర్శకత్వం : నరసింహ నంది
  • Producers: నిర్మాత‌లు : శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా అండ్ టీమ్
  • Music Director: సంగీతం :  సునీల్ కశ్యప్
  • Cinematography: సినిమాటోగ్రఫర్ : ఎస్. మురళి మోహన్ రెడ్డి
  • Editors: ఎడిటర్ : వి నాగిరెడ్డి

అబౌట్

డిగ్రీ కాలేజ్ : రివ్యూ  

విడుదల తేదీ : ఫిబ్రవరి 07, 2020
Spotnewschannel.com rating : 2/5
నటీనటులు :  వరుణ్, దివ్యా రావు తదితరులు
దర్శకత్వం : నరసింహ నంది
నిర్మాత‌లు : శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా అండ్ టీమ్
సంగీతం :  సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫర్ : ఎస్. మురళి మోహన్ రెడ్డి
ఎడిటర్ : వి నాగిరెడ్డి

వరుణ్, దివ్యా రావు జంటగా దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన సినిమా డిగ్రీ కాలేజ్. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది. మరి ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం
కథ:
శివ (వరుణ్) పార్వతి (దివ్యా రావు) ఒకే కాలేజీలో చదువుకుంటారు. పేదవాడైన తక్కువ వర్గానికి చెందిన శివ హోదా పలుకుబడి కలిగిన పోలీస్ అధికారి కూతురు పార్వతిని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలిసిన పార్వతి తండ్రి వీరి ప్రేమను వ్యతిరేకిస్తాడు. దీనితో శివ పార్వతి లేచి పోయి పెళ్లి చేసుకుంటారు. దీనితో రగిలిపోయిన పార్వతి తండ్రి తీవ్రంగా వెతికి కూతురు పార్వతిని పట్టుకొస్తాడు. మరి శివ మళ్ళీ ఆమెను కలిశాడా? పార్వతి తండ్రి మనసు మారిందా? వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 
 
విశ్లేషణ 
డిగ్రీ కాలేజ్ సినిమా హీరోయిన్ దివ్యా రావ్ నటన స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ గా నిలించింది. తెలంగాణా స్లాంగ్ లో ఆమె డైలాగ్స్ తోపాటు, బోల్డ్ ఇంటిమసీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. దివ్యా రావ్ పార్వతి పాత్రలో చాల క్యూట్ గా కనిపిస్తుంది. ఇక హీరో వరుణ్ నటనలో పర్వాలేదు. ఆయన నటన పరంగా ఇంకొంత పరిపక్వత సాధించాలని అనిపిస్తుంది. సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ఇంటిమసీ సాంగ్ ఆహ్లాదం కలిగించాయి. బాడ్ పోలీస్ అధికారిగా హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన నటుడు, అలాగే హీరో హీరోయిన్ స్నేహితుల పాత్రలు చేసిన వారు ఆకట్టుకున్నారు.
అదేవిధంగా ఈ సినిమా మైనస్ పాయింట్ మెయిన్ గా నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే. కొత్తదనం లేని స్టోరీ. పేద ధనిక వర్గానికి చెందిన వారు ప్రేమలో పడటం, వారి ప్రేమను పెద్దలు వ్యతిరేకించడం అనేది అనేక సినిమాలో ఇప్పటికే చూడడం జరిగింది. హీరో హీరోయిన్ పాత్రలను కొత్తగా.. ఆహ్లాదంగా పరిచయం చేయడంతో ఓ కొత్త తరహా మూవీ చూడబోతున్నాం అనే ఆలోచన కలుగుతుంది. ఐతే సినిమా నేపథ్యం వరంగల్ డిగ్రీ కాలేజ్ కి మారిన తర్వాత పూర్తిగా డైవర్ట్ అవుతుంది. ఇక రొమాంటిక్ సన్నివేశాలు చాలా వరకు అర్జున్ రెడ్డి మూవీ స్పూర్తితో తెరకెక్కించారనిపిస్తుంది. అలాగే ఈ చిత్ర పతాక సన్నివేశం కూడా వాస్తవానికి దూరంగా లాజిక్ లేకుండా సాగిందనిపిస్తుంది.  
 
సాంకేతిక విభాగం:
ముఖ్యంగా పేద ధనిక వర్గాల మధ్య ప్రేమ, దాంతో ఎదురయ్యే సమస్యలు అనే ఇంట్రస్టింగ్ పాయింట్ తీసుకున్నప్పటికీ ఇదివరకే ఎన్నో సినిమాలు ఇదే పాయింట్ పై రావడంతో కొత్తగా అనిపించదు. ఆయన ఈ సినిమాకు రాసుకున్న స్క్రీన్ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుందనే చెప్పాలి. నిర్మాణ విలువలు పర్వాలేదు. సునీల్ కశ్యప్ సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన ఇచ్చిన బీజీఎమ్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. వి నాగిరెడ్డి ఎడిటింగ్, మురళి మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్వాలేదు.
 
తీర్పు:
కొత్తదంలేని కథతో దర్శకుడి బోరింగ్ ట్రీట్మెంట్ సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది. దీంతో డిగ్రీ కాలేజ్ మూవీపై ఆసక్తిని ఆటంకపరచింది.