loader

ివ్యూ ఇన్ఫో

  • Release date: Feb 14, 2020
  • Starring: విజ‌య్ దేవ‌ర‌కొండ, రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా, ఇసబెల్లా
  • Director: క్రాంతి మాధవ్
  • Producers: కె.ఎ.వ‌ల్ల‌భ
  • Music Director: గోపి సుందర్
  • Cinematography: జయకృష్ణ గుమ్మడి
  • Editors: కోటగిరి వెంకటేశ్వరరావు

అబౌట్

 

వరల్డ్ ఫేమస్ లవర్ రివ్యూ

Spotnewschannel.com rating : 3/5  

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఎమోషనల్ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ వరల్డ్ ఫేమస్ లవర్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ ఈ సినిమాను నిర్మిస్తుండగా రాశి ఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ఈ రోజు ప్రేమికుల రోజున రిలీజ్ కావడం విశేషం. 
 
కథ :
గౌతమ్(విజయ్ దేవరకొండ) – యామిని(రాశీ ఖన్నా) ఇద్దరూ కాలేజ్ నుంచే ప్రేమించుకుంటారు. వారి ప్రేమను యామిని ఫాదర్ ఒప్పుకోకపోతే ఇద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటారు. అయితే హ్యాపీగా సాగుతున్న వాళ్ళ లైఫ్ ల్లోకి కొన్ని సమస్యలు వస్తాయి. కాలేజీ డేస్ నుంచే రైటర్ కావాలని బుక్స్ రాయటం స్టార్ట్ చేసిన గౌతమ్ జాబ్ మానేసి రైటర్ అవుతాను అంటాడు. దాంతో వారి మధ్య అపార్ధాలు కారణంగా యామిని గౌతమ్ ను వదిలేసి వెళ్ళిపోతుంది. గౌతమ్ ఆమె వెంట పడుతూ కన్వీన్స్ చేయటానికి ట్రై చేస్తాడు. ఈ మధ్యలో భార్య భర్తలైన శీనయ్య(విజయ్) మరియు సువర్ణ(ఐశ్వర్య రాజేష్)ల కథ నడుస్తోంది. వారి కథలో ఉన్న సమస్య ఏమిటి? ఈ కథలో (స్మిత)క్యాథెరిన్ ఎందుకు వస్తోంది? అలాగే ఈజా (ఇసబెల్లా) కథ ఏమిటి? అమెకు గౌతమ్ కు ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఈ కథలు నిజమా? కల్పితమా? చివరికి యామిని గౌతమ్ ఒక్కటవుతారా? లేదా? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాలంతే. 
 


విశ్లేషణ 

ఎప్పటిలాగే విజయ్ దేవరకొండ తన నటనతో సినిమాలోనే హైలైట్ గా నిలిచాడు. అలాగే డిఫరెంట్ వేరియేషన్స్ లో స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. తన మాడ్యులేషన్ అండ్ తన టైమింగ్‌ తో అక్కడక్కడా.. తన మార్క్ యాక్టింగ్ తో నవ్విస్తూనే.. ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో విజయ్ శీనయ్య, గౌతమ్ పాత్రలకి పూర్తి న్యాయం చేశాడు. ఇక శీనయ్య క్యారెక్టర్ వైఫ్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ సువర్ణ పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతో కూడా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ఫ్యామిలీ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ ఐశ్వర్య నటన చాల బాగుంది.
అదేవిధంగా రాశి ఖన్నా నటన, విజయ్ తో కెమిస్ట్రీ చాలా బాగుంది. ఎమోషనల్ సీన్ లో ఆమె కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ క్యాథెరిన్ థెరిస్సా, ఇసబెల్లా తమకిచ్చిన చిన్న పాత్రల్లో నటించడానికి ఓ ప్రయత్నం అయితే చేశారు. పెద్దగా స్క్రీన్ టైం కూడా లేకపోయినా ఉన్నంతలో తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. కమెడియన్ ప్రియదర్శి హీరో ఫ్రెండ్ గా, హీరోకి హెల్ప్ చేసే సపోర్టింగ్ రోల్ లో బాగా నటించాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.
 అలాగే.. దర్శకుడు క్రాంతి మాధవ్ లవ్ అండ్ ఎమోషన్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో చాలా సన్నివేశాలు సాగతీసినట్లు.. దానికి తోడు సినిమాటిక్ గా అనిపిస్తాయి. సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి చాలా స్కోప్ ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే దానికన్నా.. తను అనుకున్న ఎమోషన్ డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపించాడు. దాంతో లవ్ సీన్స్ బోర్ గా సాగాయి. దీనికి తోడు సినిమాలో ఎక్కడా సరైనా ఇన్ వాల్వ్ చేసే సంఘర్షణ లేకపోవడం కూడా.. సినిమాపై ఆసక్తిని అంతగా కలిగించలేకపోయింది. 
 
సాంకేతిక విభాగం:
సాంకేతిక అంశాలకు సంబంధించి వస్తే  ముందే చెప్పినట్లుగా.. దర్శకుడు లవ్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నా.. ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు సరైన స్క్రీనే ప్లే రాసుకోలేకపోయారు. గోపిసుందర్  అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తోంది. కానీ ఆయన అందించిన పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో  రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో  చాలా బ్యూటిఫుల్ గా  చూపించారు. ఎడిటింగ్ బాగుంది కానీ.. సినిమాలో సాగతీత సన్నివేశాలను  తగ్గించి ఉంటే..  సినిమాకి ప్లస్ అయ్యేది.  నిర్మాత కె.ఎ.వ‌ల్ల‌భ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు రిచ్ గా ఉన్నాయి. 
 
తీర్పు:

ఎమోషన్ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అంతగా కెమిస్ట్రీని పండించడంలో మిస్ ఫైర్ అయింది.