ివ్యూ ఇన్ఫో
- Release date: Jan 24, 2020
- Starring: రవి తేజ, పాయల్ రాజపుట్, నాభ నాట్స్
- Director: వి ఆనంద్
- Producers: రామ్ తాళ్లూరి
- Music Director: థమన్ స్
- Cinematography: కార్తీక్ ఘట్టమనేని
- Editors: శ్రవణ్ కటికనేని
డిస్కో రాజా (రవితేజ) 1980 కాలంలో మద్రాస్ లో పెద్ద గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. అలా అటాక్ లతో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఎదురులేకుండా సాగుతున్న డిస్కో రాజా, హెలెన్ (పాయల్ రాజ్ పుత్)ను చూసి ఆమె ధైర్యాన్ని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. ఈ మధ్యలో తనకు అడ్డు వచ్చిన బర్మా సేతు (బాబీ సింగ్) ను జైలుకి పంపి అడ్డు తొలిగిస్తాడు. ఇక ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం డిస్కో రాజా అన్ని వదిలేసి హెలెన్ తో లడఖ్ ప్రాంతానికి వచ్చేస్తాడు. అయితే అక్కడ తన పై జరిగిన అటాక్ లో డిస్కో రాజా చనిపోయి.. మళ్ళీ ముప్పై సంవత్సరాల తరువాత ఒక ఐస్ ట్రెక్కింగ్ చేస్తున్న గ్రూప్ కు దొరుకుతాడు. అయితే చనిపోయిన మనుషుల్లో మళ్ళీ జీవం పోసి బతికించడానికి ఎప్పటినుంచో రీసెర్చ్ చేస్తోన్న టీమ్ (తాన్యా హోప్ బ్యాచ్) కారణంగా డిస్కో రాజా మళ్ళీ బతుకుతాడు. మరోపక్క వాసు (రవితేజ) కోసం కొంతమంది వెతుకుతూ ఉంటారు. ఇంతకీ వాసుకి డిస్కో రాజాకి ఉన్న సంబంధం ఏమిటి ? వాసుతో నభా (నభా నటేష్) ప్రేమ కథ ఎలా మొదలైంది ? ఎలా కొనసాగింది ? అసలు ‘డిస్కో రాజా’ను చంపింది ఎవరు ? వారి పై డిస్కో రాజా ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెర పై చూడాల్సిందే.