ప్రెజర్ కుక్కర్ రివ్యూ
Spotnewschannel.com 2.75/5
సుజయ్ – సుశీల్ దర్శకత్వంలో సాయి రోనాక్ – ప్రీతీ ఆష్రాని జంటగా ఫన్నీ టైటిల్ తో పాటు మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ‘ప్రెజర్ కుక్కర్’. అయితే ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం.
కథ :
కిశోర్(సాయి రోనక్) చిన్నతనం నుంచే అతని తండ్రి నారాయణ (సీవీఎల్ నరసింహారావు) కిశోర్ ను అమెరికాను పంపాలని.. తపిస్తుంటాడు. ఎలాగైనా తన కొడుకు అమెరికాకి పోయాడని అందరికీ గొప్పగా చెప్పుకోవాలని ఆరాటపడుతుంటాడు. కానీ కిశోర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమెరికాకు మాత్రం వీసా దొరకదు. దాంతో అందరూ చేసే కామెంట్స్ వినలేక.. వీసా ప్రయత్నాలు అని చెప్పి హైదరాబాద్ లో ఉంటున్న తన ఫ్రెండ్స్ దగ్గరకు వస్తాడు. ఈ సమయంలో అతనికి అనిత (ప్రీతి అస్రాని)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఈ మధ్యలో కిశోర్ కి వరుసగా వీసా రిజెక్ట్ అవుతుంది. అంతలో అనుకోని ఆపదలో చిక్కుకుంటాడు. దాన్నుంచి బయటపడే క్రమంలో గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే పరికరం కనిపెడతాడు. దాంతో అతని లైఫ్ తిరుగుతుంది. వీసా వస్తోంది. కానీ ఆనంద్ రావు (తనికెళ్ల భరణి) రూపంలో అతని ఆలోచనా విధానం మారుతుంది. మరి కిశోర్ తన తండ్రి కోరిక మేరకు అమెరికా వెళ్లాడా? లేదా? అలాగే కిశోర్- అనితల లవ్ స్టొరీ ఎలా సాగింది? చివరికి వారు ఒక్కటయ్యారా? లేదా? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
'ప్రెజర్ కుక్కర్' అనే సినిమా పేరులోనే ప్రెజర్ ఉంది. ఇక సినిమాలో కూడా ఎక్కువుగా అమెరికా పోవాలి అనే 'ప్రెజర్' అనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన సాయి రోనక్ తన పాత్రకు తగ్గట్లు… తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరోయిన్ తో సాగే ట్రాక్ లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన ప్రీతీ ఆష్రాని కొన్ని లవ్ సీన్స్ లో అవలీలగా నటించడమే కాకుండా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఎమోషనల్ పాత్రలో నటించిన తనికెళ్ల భరణి అద్భుతంగా నటించారు. ఇక హీరో ఫ్రెండ్స్ గా నటించిన రాహుల్ రామకృష్ణతో పాటు మరో నటుడు కూడా తన కామెడీ టైమింగ్ తో తాను కనిపించిన సీన్స్ చాలా బాగా అలరించారు. దర్శకులు తీసుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. వాళ్ళు రాసుకున్న కొన్ని లవ్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అలాగే మెయిన్ గా.. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
అదేవిధంగా దర్శకులు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత ఆసక్తికరంగా సాగని సీన్స్ తో స్టోరీని డైవర్ట్ చేశారు. పైగా అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం విసుగు తెప్పిస్తోంది. అయితే దర్శకులిద్దరూ రాసుకున్న థీమ్, కొన్ని ప్రేమ సన్నివేశాలు పర్వాలేదనిపించినప్పటికీ.. స్టోరీ.. స్క్రీన్ ప్లేలో ప్లో మిస్ అయ్యింది. మెయిన్ గా స్క్రీన్ ప్లే ఆకట్టుకొనేలా సాగుతుంది. దీనికి తోడు సెకెండ్ హాఫ్ స్లోగా సాగుతూ కాస్త బోర్ అనిపిస్తుంటుంది. మొత్తంగా స్టోరీ లైన్ మంచిగా ఉన్నప్పటికీ.. దాన్ని పూర్తి స్థాయిలో ఆకట్టుకొనేలా స్క్రీన్ ప్లేను నడిపారు. అలాగే సినిమాలో ఉన్న కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు. దీనికితోడు హీరో చుట్టూ సాగే డ్రామాలో బలహీనమైన ఘట్టాలు సాగేలా అనిపిస్తుంటుంది. సినిమాలో సంఘర్షణ బలంగా నడపలేకపోయింది.
సాంకేతిక విభాగం :
అయితే సాంకేతిక నిపుణులను గురించి చెప్పాలంటే.. సంగీత దర్శకుడు అందించిన నేపధ్య సంగీతం జస్ట్ ఒకే అనిపించింది. హీరోయిన్ లవ్ స్టోరీకి ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఇక ఎడిటింగ్ బాగుంది గాని.. సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే.. బాగుండేది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. అలాగే.. బలమైన ప్రేమ సన్నివేశాలు చాలా సహజంగా చూపారు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.
తీర్పు :
మంచి పాయింటే కానీ స్టోరీ నడపడంలో వెనకబడింది.