సవారి : రివ్యూ
స్పాట్ న్యూస్ ఛానల్ రేటింగ్ : 2.5/5
నటుడు నందు హీరోగా ప్రియాంక శర్మ హీరోయిన్ గా ‘బంధం రేగడ్’ అనే షార్ట్ ఫిలింతో 2018లో ప్రతిష్టాత్మక ‘సైమా’ బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డు అందుకున్న సాహిత్ మోత్కూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘సవారి’. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా ట్రైలర్, పాటలతో ఆకట్టుకొని మంచి బజ్ ను తెచ్చుకుంది. మరిప్పుడు ఈ చిత్రం వెండితెర ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో చూడాలి.
కథ :
రాజు (నందు) స్లమ్ ఏరియాలో ఉంటూ గుర్రాన్ని నడుపుకునే దిగువు తరగతి వ్యక్తి. తన వంశపారంపర్యంగా వచ్చే సవారి వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. దీంతో తన గుర్రం (బాద్షా) అంటే తనకు ప్రాణం. అయితే ఆ ప్రాణానికి ఓ సమస్య ఉంటుంది. ఆ గుర్రానికి ఉన్న సమస్యను తీర్చడానికి కష్టపడి డబ్బులు పోగేస్తుంటాడు. అలాగే భాగీ (ప్రియాంక శర్మ)ను ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ కొన్ని ఊహించని పరిణామాల రీత్యా ఓ రోజు బాద్షా మిస్సయ్యిపోతుంది. అలా తాను ఎంతగానో ప్రేమించే బాద్షా ఎందుకు మిస్సయ్యింది? అందుకు గల కారకులు ఎవరు? అది దొరికిందా లేదా? అసలు భాగీ రాజును ఎంతగా ప్రేమిస్తోంది? వీరి ప్రేమకు ఉన్న అడ్డు ఏమిటి? వంటి విషయాలు తెలియాలి అంటే సినిమాను చూడాల్సిందే.
విశ్లేషణ :
నటునిగా సపోర్టింగ్ రోల్స్, హీరోగా నందు ఇప్పటి వరకు చాలా సినిమాలనే చేసారు. కానీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే సినిమాగా మాత్రం ఏ ఒక్కటీ అంత స్కోప్ తీసుకురాలేక పోవడం జరిగింది. కానీ ఈ సినిమా మాత్రం నందు కెరీర్ కు ఆ ఇంపాక్ట్ ను ఖచ్చితంగా తీసుకొచ్చింది. ఇప్పటి వరకు స్టైలిష్ గా అనేక కోణాల్లో కనిపించిన నందు ఈ సనిమాలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. తన నటన ఈ చిత్రానికి మేజర్ హైలైట్ గా నిలించింది. అమాయక పాత్రలో కనిపించి చిన్న చిన్న మ్యానరిజమ్స్ తో తాను కనబర్చిన నటనా తీరు చాలా ఆకట్టుకుంటుంది. అలాగే పలు కీలకమైన ఎమోషనల్ ఎపిసోడ్స్ లో సినిమా చూసే ప్రేక్షకునికి కూడా ఆ ఫీల్మ్ ను తీసుకొచ్చే విధంగా సినిమా మొత్తం తానే నడిపించాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే.. హీరోయిన్ ప్రియాంక శర్మ కూడా మంచి నటనను కనబర్చింది. అలాగే సినిమా అంతా మంచి పక్కా మాస్ అమ్మాయిగా కనిపించి చక్కని హావభావాలతో ఏ సీన్ కు ఎలా కావాలో అలా తనని తాను మలచుకున్న తీరు బాగుటుంది. ముందే హిట్టయిన రెండు ట్రాక్స్ నీ కన్నులు సాంగ్, ఉండిపోవా పాటలు విజువల్ గా కూడా అంతే స్థాయిలో మెప్పిస్తాయి. అలాగే.. విలన్ రోల్ లో కనిపించిన శ్రీకాంత్ రెడ్డి ఒక పక్క విలజనిజం మరో పక్క దానితోనే కామెడీ యాంగిల్ బాగా నడిపించాడు. అతనికి.. అతని గ్యాంగ్ మధ్య వచ్చే ప్రతీ కామెడీ ట్రాక్ బాగుంది. దీనిని దర్శకుడు బాగా ప్రిపేర్ చేసుకున్నారు. అలాగే ఇతర పాత్రల్లో నటించిన శివ కుమార్ వంటి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.
అంతేకాకుండా సినిమాలో స్టోరీ పాయింట్.. హీరోహీరోయిన్ల పాత్రలకు మధ్య వ్యతాస్యం ఆకట్టుకొనేలా ఉంటుంది. కథాకథనాల పరంగా సినిమా ఆకట్టుకునేలా సాగలేదు. ఫేక్ ఎమోషన్స్ తో లాజిక్ లేని స్క్రీన్ ప్లేతో సినిమా సాగింది. అయితే మొదటి భాగంలో కొన్ని సీన్స్ సరదాగా సాగుతూ పర్వాలేదనిపించినప్పటికీ.. సినిమాలో బలమైన సంఘర్షణ మిస్ అయింది. పైగా సెకెండ్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్లు మధ్య కొన్ని లవ్ సీన్స్ అనవసరంగా సాగతీతకు గురయ్యాయి. మరికొన్ని సన్నివేశాల్లో నాటకీయత మరీ ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించింది. స్లమ్ ఏరియాలో ఉంటూ ఒక గుర్రం నడుపుకునే కుర్రాడు, రిచ్ క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడటం, చిన్న చిన్న మేలో డ్రామా ఇన్సిడెంట్ల కారణంగా ఆ ప్రేమను ఆ అమ్మాయి కూడా ఫీల్ అవ్వడం, వీటికి తోడు వీళ్ళద్దరూ ప్రేమకు ఒక విలన్.. అతని వల్ల వీళ్ళ లవ్ స్టోరీలో సమస్యలు రావడం ఇలా బలం లేని సీన్స్ తో సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.
అయితే ఈ సన్నివేశాల్లో కూడా దర్శకుడు కొన్ని చోట్ల మంచి హ్యూమర్ ను పండించాడు. మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగానే ఎలివేట్ చేసినా.. కొన్ని చోట్ల నిరాశ పరుస్తాడు. కంటెంట్ పరంగా ఇంకా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు సినిమాను సింపుల్ గా ముగించడం అంతగా రుచించదు.
సాంకేతిక విభాగం :
అనుకున్నట్లుగానే దర్శకుడు మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నా.. ఆ కాన్సెప్ట్ ని తెర మీద చూపించడంలో కొంత తడబాటుకు లోనయ్యాడు. అయినప్పటికీ కొన్ని కామెడీ అండ్ లవ్ సీక్వెన్స్ లో.. క్లైమాక్స్ మరికొన్ని కీలక సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. మొనీష్ భూపతిరాజు కెమెరా పనితనం ఇంప్రెస్ చేశాడు. ఆయన తీసిన విజువల్స్, కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. ఇక సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన సంగీతం బాగుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం బాగా ఆకట్టుకుంది. ఎడిటర్ గా పనిచేసిన సంతోష్ మేనం అద్భుతంగా ప్రదర్శించాడు. ఇక నిర్మాతలు సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుదితి నిర్మాణ విలువులు కూడా బాగున్నాయి.
తీర్పు :
‘సవారి’ అంటూ బోల్డ్ స్లమ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా అక్కడక్కడా బోల్డ్ అండ్ ఎమోషనాలిటీని పండించింది.